ఫైజర్‌కు పోటీగా రష్యా ప్రకటన.. తమ టీకా 92 శాతం సమర్థంగా పనిచేస్తుందన్న రష్యా

  • తమ టీకా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందన్న ఫైజర్
  • ఆ వెంటనే రష్యా కూడా ప్రకటన
  • స్పుత్నిక్-వి 92 శాతం ప్రభావవంతం 
తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ వెల్లడించిన వెంటనే రష్యా కూడా అటువంటి ప్రకటనే చేసింది. తమ కొవిడ్ టీకా స్పుత్నిక్-వి 92 శాతం సమర్థంగా పనిచేస్తుందని, మధ్యంతర ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే తొలిసారి తుది ప్రయోగాలు కూడా పూర్తికాకుండానే రష్యా ఈ టీకాను రిజిస్టర్ చేయడం గమనార్హం.

రష్యాలోని గమలేయా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను ఇప్పటి వరకు 40 వేల మందిపై ప్రయోగించారు. కరోనా బారినపడే అవకాశం వీరిలో 92 శాతం తక్కువగా ఉన్నట్టు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) పేర్కొంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తమ వద్ద అత్యంత ప్రభావవంతమైన కరోనా టీకా ఉందని వెల్లడించింది.

Russia
Sputnik V
corona vaccine
Pfizer

More Telugu News